Jagan: పోలవరంపై ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష

  • పోలవరం విషయంలో ప్రభుత్వ నిర్ణయాలపై వ్యతిరేకత
  • అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న ఏపీ సీఎం
  • న్యాయపరమైన చిక్కులు ఎలా అధిగమించాలన్నదానిపై ప్రముఖంగా చర్చ!

పోలవరం ప్రాజక్టుపై ఇటీవల తీసుకున్న నిర్ణయాలపై ప్రతికూలత ఎదురవుతున్న నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హైడల్ ప్రాజెక్టుపై నవయుగ సంస్థ కోర్టులో సవాల్ చేయడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులు రావడం, రివర్స్ టెండరింగ్ ముందుకు కదలకపోవడం వంటి కీలక అంశాలను జగన్ ఈ సమీక్షలో అధికారులతో చర్చించారు. ఆయా సమస్యలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం, ఏ విధంగా ముందుకు వెళ్లాలన్నదానిపై వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ముఖ్యంగా, న్యాయపరమైన చిక్కులు వస్తే ఏ విధంగా పరిష్కరించుకోవాలన్నదానిపైనే చర్చ సాగినట్టు తెలుస్తోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News