Arun Jaitly: జైట్లీ మరణం.... విశాఖ-విజయవాడ డబుల్ డెక్కర్ రైలు ప్రారంభోత్సవం వాయిదా

  • ఈ నెల 26న ఉదయ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభోత్సవం
  • అనారోగ్యంతో జైట్లీ మృతి
  • త్వరలోనే మరో తేదీ ప్రకటన!

కేంద్ర రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన అరుణ్ జైట్లీ మృతి కారణంగా విశాఖపట్నం-విజయవాడ డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఈ ఏసీ రైలును ఈ నెల 26న విశాఖపట్నం నుంచి ప్రారంభించాలని కేంద్రం సన్నాహాలు చేసింది. రైల్వే శాఖ సహాయమంత్రి సురేశ్ చేతుల మీదుగా ఉదయ్ రైలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఇంతలో జైట్లీ మృతి చెందడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఉదయ్ ఎక్స్ ప్రెస్ రైలు ఉదయం 5.45 గంటలకు విశాఖలో బయల్దేరి 11.15  గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఇది ఆదివారం, గురువారం తప్ప మిగతా అన్ని రోజుల్లో నడుస్తుంది. కాగా, రైలు ప్రారంభోత్సవం తేదీని త్వరలోనే ప్రకటించే అవకాశాలున్నాయి.

Arun Jaitly
Uday Express
Vizag
Vijayawada
  • Loading...

More Telugu News