Balakrishna: అరుణ్ జైట్లీ మృతికి నందమూరి బాలకృష్ణ సంతాపం

  • కన్నుమూసిన అరుణ్ జైట్లీ
  • స్పందించిన బాలయ్య
  • దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేశారంటూ కితాబు

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి జైట్లీ విశేషంగా కృషి చేశారని కొనియాడారు. గత కొన్నిరోజులుగా ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న జైట్లీ ఈ మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. మధ్యాహ్నం 1.30 గంటలకు అంతిమయాత్ర మొదలవుతుంది. ఢిల్లీ నిగమ్ బోధ్ శ్మశాన వాటికలో మధ్యాహ్నం 2.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Balakrishna
Arun Jaitly
  • Loading...

More Telugu News