Jagan: రాజధానిపై సీఎం జగన్ ఏమీ చెప్పలేదు కాబట్టి ఆందోళన చెందాల్సిన పనిలేదు: సుజనా

  • ఏపీ రాజధాని తరలిస్తున్నారంటూ ప్రచారం
  • ఆందోళనలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు
  • సుజనాను కలిసిన రాజధాని రైతులు

ఏపీ రాజధాని అమరావతి విషయంలో సీఎం జగన్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు కాబట్టి దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని బీజేపీ నేత సుజనా చౌదరి అన్నారు. రాజధాని తరలిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంపై రైతులు సీఎంను కలిస్తే మేలని సలహా ఇచ్చారు. ప్రకృతి విపత్తులను దృష్టిలో పెట్టుకుని రాజధానిని మార్చడం సమంజసం కాదని అన్నారు. ప్రకృతి నుంచి ఎదురయ్యే సమస్యలను ఎవరూ ఎదిరించలేరని, ఈ కారణంగా రాజధాని మార్చాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. రాజధాని రైతుల బృందం తనను కలిసిన సందర్భంగా సుజనా ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానికి భూములు ఇచ్చేసిన రైతులకు బీజేపీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

Jagan
Andhra Pradesh
Amaravati
Sujana Chowdary
  • Loading...

More Telugu News