Kodela: కోడెల రాజకీయ అనుభవాన్నంతా అక్రమసంపాదన కోసమే వినియోగించారు: మోపిదేవి

  • కోడెల వ్యవహారంపై స్పందించిన ఏపీ మంత్రి
  • అసెంబ్లీ ఫర్నిచర్ తీసుకెళ్లడం దిగజారుడుతనం అని పేర్కొన్న మోపిదేవి
  • విచారణతో వాస్తవాలు బయటికి వస్తాయంటూ వ్యాఖ్యలు

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ఎన్నికల ఫలితాల అనంతరం ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. ఆయన కొడుకు, కుమార్తెలపై కేసులు, అసెంబ్లీ ఫర్నిచర్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ స్పందించారు. కోడెల తన రాజకీయ అనుభవమంతా అక్రమ సంపాదన కోసమే వినియోగించారని ఆరోపించారు. కోడెల ఏపీ అసెంబ్లీ ఫర్నిచర్ ను తీసుకెళ్లడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం అని విమర్శించారు. విచారణతో నిజానిజాలు బయటికి వస్తాయని మోపిదేవి వ్యాఖ్యానించారు.

Kodela
Mopidevi
Andhra Pradesh
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News