Andhra Pradesh: గ్రామ సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా కాల్ చేస్తే మాకు ఫిర్యాదు చేయండి!: ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్

  • అభ్యర్థులు ఎవరూ దళారుల్ని నమ్మి మోసపోవద్దు
  • పరీక్షలను పారదర్శకంగా, గట్టి భద్రత మధ్య నిర్వహిస్తాం
  • శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన మంత్రి

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తామని మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు.  అభ్యర్థులు ఎవరూ దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షల నిర్వహణ కోసం గట్టి భద్రత కల్పిస్తామని చెప్పారు.

శ్రీకాకుళంలో ఈరోజు ధర్మాన మీడియాతో మాట్లాడారు. గ్రామ సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామనీ, ఇందుకు డబ్బులు ఇవ్వాలని ఎవరైనా ఫోన్ చేస్తే నమ్మి మోసపోవద్దని కోరారు. అలాంటి కాల్స్ పై ప్రభుత్వానికి సమాచారం అందించాలని సూచించారు.

Andhra Pradesh
Grama sachivalayam
jobs
Dont trust brokers
compllaint
whatsapp number
YSRCP
minister
Dharmana krishnadas
Srikakulam District
  • Loading...

More Telugu News