Arun Jaitly: జైట్లీ మృతి నాకు తీరని లోటు: వెంకయ్య నాయుడు

  • నాకున్న అత్యంత సన్నిహితుల్లో జైట్లీ ఒకరు
  • జైట్లీ ఒక న్యాయకోవిదుడు, ఉత్తమ పార్లమెంటేరియన్
  • పన్ను విధానంలో సమూల మార్పులకు కృషి చేశారు

అరుణ్ జైట్లీ మరణం దేశానికి, వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. జైట్లీ తనకు దీర్ఘకాల మిత్రుడని, తనకున్న అత్యంత సన్నిహితుల్లో ఒకరని చెప్పారు. ఆయన ఒక న్యాయకోవిదుడని, ఉత్తమ పార్లమెంటేరియన్ అని అన్నారు. పన్ను విధానంలో సమూల మార్పులకు ఆయన కృషి చేశారని, జీఎస్టీని తీసుకురావడంలో ప్రముఖ పాత్రను పోషించారని తెలిపారు.

జైట్లీ మరణవార్తతో చెన్నైలో ఉన్న వెంకయ్య... తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. ఉన్నపళంగా ఢిల్లీకి బయల్దేరారు. చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ మేరకు స్పందించారు.

Arun Jaitly
Venkaiah Naidu
BJP
  • Loading...

More Telugu News