Amit Shah: ఓ కుటుంబ సభ్యుడ్ని కోల్పోయినంత బాధగా ఉంది: జైట్లీ మృతికి అమిత్ షా తీవ్ర విచారం

  • అరుణ్ జైట్లీ కన్నుమూత
  • వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అన్న అమిత్ షా
  • ఎప్పటికీ ఆయనే మార్గదర్శి అంటూ వ్యాఖ్యలు

బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన అరుణ్ జైట్లీ అనారోగ్యంతో పోరాడుతూ ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఓ కుటుంబ సభ్యుడ్ని కోల్పోయినంత బాధగా ఉందని వ్యాఖ్యానించారు. జైట్లీ మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అన్నారు. జైట్లీ పార్టీ అగ్రనేతగానే కాకుండా తన కుటుంబంలో ముఖ్యుడిగా, తనకు మార్గదర్శిగా ఉన్నారని, ఇప్పుడాయన లేరంటే భరించలేనంత బాధ కలుగుతోందని తెలిపారు.

Amit Shah
BJP
Arun Jaitly
  • Loading...

More Telugu News