Andhra Pradesh: అన్యమత టికెట్లను కొందరు కుట్ర పూరితంగా తిరుపతి రూట్లో పెట్టారు!: వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు

  • టీడీపీ హయాంలోనే ఈ టికెట్ల ముద్రణ
  • బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం
  • పశ్చిమగోదావరిలో మీడియాతో వైసీపీ నేత

తిరుమలలో అన్యమత ప్రచారం వివాదంపై వైసీపీ నేత, నర్సాపురం లోక్ సభ సభ్యుడు రఘురామకృష్ణంరాజు తీవ్రంగా స్పందించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అన్యమత ప్రచారం ఉన్న టికెట్ల ముద్రణ జరిగిందని ఆయన అన్నారు. ఈ టికెట్లను కొందరు కుట్ర పూరితంగా తిరుపతి మార్గంలో పెట్టారని విమర్శించారు. ఈ ఘటనకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం అమిరంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకే కొందరు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని రఘురామకృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పై మతవాదిగా ముద్రవేయడంపై ఆయన మండిపడ్డారు. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించిందని గుర్తుచేశారు.

Andhra Pradesh
Jagan
Telugudesam
Raghuramakrishnamraju
YSRCP
Anyamata pracharam
  • Loading...

More Telugu News