Arun Jaitly: హైదరాబాద్ పర్యటనను మధ్యలోనే ముగించుకుని ఢిల్లీ బయల్దేరిన అమిత్ షా

  • కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూత
  • హుటాహుటిన ఢిల్లీకి పయనమైన అమిత్ షా
  • ఎయిమ్స్ ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్న బీజేపీ నేతలు

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ కాసేపటి క్రితం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన పర్యటనను మధ్యలోనే ముగించుకున్నారు. హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. మరోవైపు, అరుణ్ జైట్లీ మరణవార్తతో బీజేపీ నేతలు ఆవేదనలో మునిగిపోయారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఎయిమ్స్ ఆసుపత్రి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

Arun Jaitly
Amit Shah
BJP
  • Loading...

More Telugu News