Andhra Pradesh: జగన్ గారి ప్రభుత్వానికి ప్రజారోగ్యం చిత్తు కాగితంతో సమానం అనుకుంటా!: నారా లోకేశ్ ఆగ్రహం

  • వరద బాధితులకు కాలం చెల్లిన నూనె ప్యాకెట్లు
  • గుంటూరు జిల్లాలో ఘటన
  • ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డ లోకేశ్

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో వరద బాధితులకు అధికారులు కాలంచెల్లిన నూనె ప్యాకెట్లను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై చాలామంది వరద బాధితులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు తమ ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా  ఈ వ్యవహారంపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు.

వైఎస్ జగన్ గారి ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్య భద్రత చిత్తుకాగితంతో సమానంగా మారిందని నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే కాలం చెల్లిన నూనెప్యాకెట్లు సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈ పాత సరుకుల కొనుగోలుకు జే-ట్యాక్స్(జగన్ ట్యాక్స్) ఎంత వసూలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

Andhra Pradesh
YSRCP
Jagan
Telugudesam
Nara Lokesh
Twitter
Guntur District
Flood victims
Expired oil packets
Distributed
  • Error fetching data: Network response was not ok

More Telugu News