Ram Madhav: ఏపీలో విధ్వంసం జరుగుతోంది.. చూస్తూ ఊరుకోబోం: రామ్ మాధవ్

  • ప్రజల ఆకాంక్షలను వైసీపీ ప్రభుత్వం నెరవేర్చాలి
  • లేకపోతే ప్రతిపక్ష పాత్రను పోషిస్తాం
  • ప్రభుత్వంపై పోరాటాలు కూడా చేస్తాం

ఏపీని అభివృద్ధి దిశగా తీసుకెళ్తారనే ఆకాంక్షతోనే ప్రజలు వైసీపీకి అధికారం కట్టబెట్టారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు. అయితే ఇంత వరకు ఎలాంటి నిర్మాణం ప్రారంభం కాలేదని... విధ్వంసం మాత్రం జరుగుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు చేస్తే... చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం మాదిరే రాష్ట్రంలో కూడా సమర్థవంతమైన పాలనను అందించాలని కోరుకుంటున్నామని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకుంటే... ప్రతిపక్ష పాత్రను కూడా పోషించేందుకు సిద్ధమని అన్నారు. ప్రభుత్వంపై పోరాటాలు కూడా చేస్తామని చెప్పారు.

Ram Madhav
BJP
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News