kodela sivaprasad: తప్పుచేస్తే చట్టపరమైన శిక్షకు ఓకే...కక్ష సాధిస్తే ఊరుకునేది లేదు: కోడెల ఉదంతంపై చంద్రబాబు
- కోడెల వ్యవహారంపై టీడీపీ అధినేత స్పందన ఇది
- అసెంబ్లీ ఫర్నీచర్‌ను ఇంటికి తరలించడంతో హాట్ టాపిక్
- విమర్శలు వెల్లువెత్తడంతో స్పందించిన మాజీ ముఖ్యమంత్రి
తమ పార్టీ నాయకుడు కోడెల శివప్రసాద్ తప్పుచేసినట్లు రుజువైతే చట్టపరమైన శిక్ష తీసుకోవచ్చని, కానీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే మాత్రం ఊరుకునేది లేదని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీ మాజీ సభాపతి కోడెల, అసెంబ్లీ ఫర్నీచర్‌ను తన సొంతింటికి తరలించారన్న అంశం హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.
ఈ విషయం బయటకు పొక్కడంతో ఫర్నీచర్ తనవద్దే ఉందని, ఖరీదు ఎంతో చెబితే డబ్బు చెల్లిస్తానని కోడెల ప్రకటించినా వివాదం సద్దు మణగలేదు సరికదా, వివాదం రోజురోజుకీ ముదిరి పాకానపడుతుండడంతో దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. తప్పు జరిగినప్పుడు బాధ్యులపై చర్య తీసుకోవడానికి తమ పార్టీ అడ్డుపడదన్నారు. కానీ ప్రభుత్వం రాజకీయ కక్షకు పాల్పడకూడదని హెచ్చరించారు.