kodela shivaprasad: గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన మాజీ స్పీకర్ కోడెల.. ఆసుపత్రికి చేరుకుంటున్న టీడీపీ నేతలు

  • గత రాత్రి గుండెపోటుతో కుప్పకూలిన కోడెల
  • ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో మాజీ  స్పీకర్
  • ఆరోపణలు, కేసులతో ఒత్తిడిలోకి..

ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. శుక్రవారం రాత్రి ఆయన తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలియడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకుంటున్నారు.

కోడెల ఇటీవల పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన కుమారుడు, కుమార్తెపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల వ్యవహారం కొనసాగుతుండగానే అసెంబ్లీ ఫర్నిచర్ వివాదం చుట్టుముట్టింది. తాజాగా, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు మాయం చేశాడంటూ అతడి కుమారుడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ రెండు వ్యవహారాలపై విచారణ కొనసాగుతోంది. తన కుటుంబంపై వరుసపెట్టి ఆరోపణలు రావడం, కేసుల వ్యవహారంతో ఆయన తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయినట్టు తెలుస్తోంది. ఆయన గుండెపోటుకు అదే కారణమని భావిస్తున్నారు.

kodela shivaprasad
Andhra Pradesh
heart attack
  • Loading...

More Telugu News