Varla Ramaiah: మంత్రి అనిల్ గారూ, ఓ పడవ ప్రకాశం బ్యారేజ్ లో ఇరుక్కుపోయి అతలాకుతలం చేస్తోంది, ముందా పడవను తొలగించండి: వర్ల రామయ్య

  • ప్రకాశం బ్యారేజ్ గేట్లకు అడ్డంపడిన బోటు
  • నీరు లీకవుతూ సముద్రంపాలు
  • ట్విట్టర్ లో స్పందించిన వర్ల రామయ్య

విజయవాడ ప్రకాశం బ్యారేజ్ లో నీటిని దిగువకు విడుదల చేసే గేట్ల వద్ద ఓ బోటు ఇరుక్కుపోవడం మీడియాలో ప్రముఖంగా కనిపించింది. బోటు కారణంగా గేట్లు మూసేందుకు వీల్లేకుండా పోయింది. దాంతో నీరు దిగువకు వెళ్లిపోతూ వృథాగా సముద్రం పాలవుతోంది. దీనిపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. 'అయ్యా మంత్రి అనిల్ గారూ, ప్రకాశం బ్యారేజ్ ఖానాలో ఓ పడవ ఇరుక్కుపోయి మొత్తం జలవనరుల శాఖను అతలాకుతలం చేస్తోంది. అన్ని పనులు ఆపి ముందా పడవను తొలగించండి' అంటూ ట్వీట్ చేశారు. ఆ బోటు కారణంగా వేలాది క్యూసెక్కుల నీరు వృథా అవుతోందని తెలిపారు. అందరూ మీకు మాటలెక్కువ, చేతలు తక్కువ అంటున్నారని వర్ల రామయ్య తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Varla Ramaiah
Anil Kumar Yadav
Andhra Pradesh
  • Loading...

More Telugu News