India: తదుపరి భారత ప్రధాని చిదంబరమే... పాకిస్థాన్ సెనేటర్ సంచలన వ్యాఖ్యలు!

  • చిదంబరం అరెస్ట్ పై పాక్ సెనేటర్ రెహ్మాన్ మాలిక్ స్పందన
  • కశ్మీర్ ప్రజల తరఫున గళం విప్పినందుకే చిదంబరంను అరెస్ట్ చేశారంటూ ట్వీట్
  • ప్రధాని అయ్యేందుకు అన్ని అర్హతలు చిదంబరానికి ఉన్నాయంటూ వ్యాఖ్యలు

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను సీబీఐ అరెస్ట్ చేయడం తెలిసిందే. ఆయనను కోర్టులో హాజరు పరచగా, కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఈ పరిణామాలపై పొరుగున ఉన్న పాకిస్థాన్ ఓ కన్నేసి ఉంచింది. చిదంబరం అరెస్ట్ వ్యవహారంపై పాక్ సెనేటర్ రెహ్మాన్ మాలిక్ స్పందించడమే అందుకు నిదర్శనం. రెహ్మాన్ మాలిక్ ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

కశ్మీర్ లో మోదీ అక్రమ చర్యలకు నిరసనగా గళం విప్పినందుకే చిదంబరంను అరెస్ట్ చేశారని రెహ్మాన్ మాలిక్ అభిప్రాయపడ్డారు. కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించడంపై ప్రశ్నించడంతో పాటు, అక్కడి అణగారిన ప్రజల తరఫున గొంతుక వినిపించడం కూడా ఆయన అరెస్ట్ కు కారణమైందని పేర్కొన్నారు. "గుర్తుంచుకోండి, మీ తర్వాతి ప్రధాని చిదంబరమే. ప్రధాని అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్న రాజకీయవేత్త చిదంబరం" అంటూ రెహ్మాన్ మాలిక్ ట్వీట్ చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News