Enforcement Directerate: ఈడీ కేసులో చిదంబరానికి ముందస్తు బెయిల్ మంజూరు

  • సీబీఐ అరెస్టును సవాల్ చేసిన చిదంబరం
  • ఈ పిటిషన్ పై విచారణ ఈ నెల 26కు వాయిదా
  • ఈడీ నుంచి రక్షణ కోరుతూ వేసిన మరో పిటిషన పై ‘సుప్రీం’ విచారణ

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం ఇప్పటికే సీబీఐ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. చిదంబరం ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారని, ఈ నెల 26తో ఆయన కస్టడీ పూర్తికానున్నందున, అదేరోజున ఆయన పిటిషన్ పై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు వెల్లడించింది.

ఇదే కేసు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తులో ఉండటంతో, ఈడీ నుంచి రక్షణ కోరుతూ చిదంబరం దాఖలు చేసిన మరో పిటిషన్ పైనా అత్యున్నత న్యాయస్థానం ఈరోజు విచారణ జరిపింది. చిదంబరానికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 26 వరకూ ఆయన్ని అరెస్టు చేయొద్దని ఆదేశించింది. సీబీఐ, ఈడీ కేసులపై సోమవారం మరోసారి విచారణ జరుపుతామని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

Enforcement Directerate
CBI
Chidambaram
  • Loading...

More Telugu News