Esha Gupta: నా కారును ఢీకొట్టింది ఈ కారే.. దయచేసి సాయం చేయండి: ఫొటోను పోస్టు చేసిన నటి ఈషా గుప్తా

  • లీలావతి ఆసుపత్రి సమీపంలో ఘటన
  • ఇషా ట్వీట్‌కు స్పందించిన పోలీసులు
  • కృతజ్ఞతలు తెలిపిన నటి

బాలీవుడ్ నటి ఇషా గుప్తా బుధవారం తన ట్విట్టర్ ఖాతాలో ఓ కారు ఫొటోను పోస్టు చేసింది. ముంబైలోని లీలావతి ఆసుపత్రి సమీపంలో ఈ కారు తన కారును ఢీకొట్టిందని, సాయం చేయాలంటూ నంబరు ప్లేటుతో సహా ఉన్న ఫొటోను పోలీసులను ట్యాగ్ చేస్తూ పోస్టు చేసింది. ప్రమాదం చిన్నదే అయినప్పటికీ నిందితుడిని పట్టుకోవాలని కోరింది. ఇషా ట్వీట్‌కు ముంబై పోలీసులు స్పందించారు. ట్వీట్‌ను చూశామని, కాంటాక్ట్ డిటైల్స్‌ను డీఎంకు పంపాలని సూచించారు. తన ట్వీట్‌కు పోలీసులు వెంటనే స్పందించడంపై ఇషా సంతోషం వ్యక్తం చేసింది. వారికి థ్యాంక్స్ చెబుతూ మరో ట్వీట్ చేసింది.

Esha Gupta
Mumbai Police
Road Accident
Bollywood
  • Loading...

More Telugu News