kodela shivaprasad: ఏపీ మాజీ స్పీకర్ కోడెల ఇంట్లో చోరీ.. కంప్యూటర్లతో పరార్

  • సత్తెనపల్లిలోని కోడెల నివాసంలో ఘటన
  • విద్యుత్ మరమ్మతుల పేరుతో లోపలికి
  • అడ్డుకునేందుకు ప్రయత్నించిన వాచ్‌మన్‌ను తోసేసి పరారీ

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల  శివప్రసాద్ ఇంట్లో చోరీ జరిగింది. గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని కోడెల ఇంటికి చేరుకున్నారు. విద్యుత్ మరమ్మతు పనులు చేయాలంటూ లోపలికి ప్రవేశించారు. అనంతరం ఇంట్లోంచి కంప్యూటర్లు పట్టుకుని పరారయ్యారు. గేటు వద్ద ఉన్న వాచ్‌మన్ వారిని ఆపేందుకు ప్రయత్నించగా తోసేసి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.  


kodela shivaprasad
Andhra Pradesh
Guntur District
sattenapally
  • Loading...

More Telugu News