Narendra Modi: ఫ్రాన్స్ చేరుకున్న ప్రధాని మోదీ... ప్యారిస్ ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం

  • మోదీ మరో విదేశీ పర్యటన
  • మోదీకి స్వాగతం పలికిన ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి
  • ఫ్రాన్స్ అధ్యక్షుడు, ప్రధానితో సమావేశం కానున్న మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లారు. ఆయన కొద్దిసేపటి క్రితమే ఫ్రాన్స్ చేరుకున్నారు. ప్యారిస్ ఎయిర్ పోర్టులో ఫ్రెంచ్ వర్గాలు మోదీకి ఘనస్వాగతం పలికాయి. ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ లెడ్రియాన్ మోదీకి సాదర స్వాగతం పలికారు. మోదీ రెండ్రోజుల పాటు ఫ్రాన్స్ లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ తో భేటీ కానున్నారు. ప్రధాని ఎడ్వర్డ్ ఫిలిప్పేతోనూ సమావేశం అవుతారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రధాన అజెండాగా మోదీ పర్యటన సాగనుంది.

Narendra Modi
France
Paris
  • Loading...

More Telugu News