Bjp: బీజేపీలో చేరినప్పటికీ సుజనాచౌదరి ఇంకా టీడీపీ పాట పాడుతున్నారు: మంత్రి అవంతి శ్రీనివాస్

  • రాజధాని మార్చితే విప్లవం వస్తుందని బీజేపీ నేతలు అంటున్నారు!
  • వరదలపై కేంద్ర సాయం అందకపోతే నిజంగానే విప్లవం వస్తుంది
  • మా పాలనలో భూకబ్జాలకు ఆస్కారం లేదు 

బీజేపీలో చేరినప్పటికీ సుజనా చౌదరి ఇంకా టీడీపీ పాట పాడుతున్నారని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజధాని మార్చితే విప్లవం వస్తుందని బీజేపీ నేతలు అంటున్నారని, వరదలపై కేంద్ర సాయం అందకపోతే మాత్రం నిజంగానే విప్లవం వస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. భూకబ్జాలకు పాల్పడిన వారిలో ఎంత పెద్ద వ్యక్తులు వున్నా తప్పించుకోలేరని, వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు.

భూ కబ్జాలపై నాడు చంద్రబాబుకు పూర్తి సమాచారం ఇచ్చామని, ఇప్పుడు తమ పాలనలో గజం భూమి కూడా కబ్జా కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తాము నెరవేరిస్తే తమ ప్రభుత్వానికి, సీఎం జగన్ కు మంచి పేరు ఎక్కడ వస్తుందోనని చెప్పి ‘కోడిగుడ్డు మీద ఈకలు పీకే కార్యక్రమం కొందరు చేస్తున్నారు’ అని, అలాంటి పనులు చేయొద్దని, ఈ రాష్ట్రం మనందరిదీ అని, అభివృద్ధి కోసం పాటుపడదామని పిలుపు నిచ్చారు.

Bjp
Sujana Chowdary
YSRCP
Avanthi srinivas
  • Loading...

More Telugu News