Amazon: పుడమితల్లి ఊపిరితిత్తులు మండిపోతున్నాయి... అమెజాన్ అడవులు తగలబడిపోతుండడంపై మహేశ్ బాబు ఆవేదన

  • అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో కార్చిచ్చు
  • అగ్నికి ఆహుతి అవుతున్న వేలాది ఎకరాల అడవి
  • ట్విట్టర్ లో స్పందించిన మహేశ్

అమెజాన్ అడవులు కార్చిచ్చు కారణంగా పెద్ద ఎత్తున తగలబడిపోతుండడం పట్ల టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. అమెజాన్ లో కార్చిచ్చు చెలరేగిందన్న వార్త ఎంతో విచారకరం అని పేర్కొన్నారు. ప్రపంచానికి 20 శాతం ఆక్సిజన్ అమెజాన్ అడవుల నుంచే అందుతోందని, ఇప్పుడా అడవులు మంటల్లో కాలిపోతున్నాయని ట్వీట్ చేశారు. ఈ భూమండలంపై మనుగడ సాగించే ప్రతి ఒక్కరికీ ఇది మేలుకొలుపు వంటిదని పేర్కొన్నారు.

"ఈ భూమండలానికి ఊపిరితిత్తుల్లాంటి అమెజాన్  అడవులు కాలిపోతున్నాయి. అపార జీవవైవిధ్యం విలవిల్లాడుతోంది. భూమాతను కాపాడుకునేందుకు మనవంతుగా ఏదైనా చేద్దాం. పచ్చదనాన్ని కాపాడుకునే చర్యలకు మన ఇంటి నుంచే శ్రీకారం చుడదాం" అని ట్విట్టర్ లో పిలుపునిచ్చారు.

Amazon
Mahesh Babu
Tollywood
  • Loading...

More Telugu News