minster: ఏపీలో ఉన్న పరిశ్రమలను చెడగొట్టేలా ప్రభుత్వం తీరు ఉంది: టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు

  • పరిశ్రమలపై విడుదల చేసిన శ్వేతపత్రంపై విమర్శలు
  • ఈ శ్వేతపత్రంతో అభూత కల్పనలు కల్పిస్తున్నారు
  • ఈ శ్వేతపత్రం హాస్యాస్పదంగా ఉంది

ఏపీలో పరిశ్రమలపై మంత్రి గౌతంరెడ్డి విడుదల చేసిన శ్వేతపత్రంపై టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు విమర్శలు చేశారు. పరిశ్రమలపై శ్వేతపత్రం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఈ శ్వేతపత్రంతో అభూత కల్పనలు కల్పిస్తున్నారని, రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలను చెడగొట్టేలా ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు. అనంతపురం జిల్లాలోని కియా పరిశ్రమను కూడా ఎంపీ మాధవ్ బెదరగొట్టారని ఆరోపించారు.

రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీకి వేలాది పరిశ్రమలను నాడు తమ ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. ఏపీలో గవర్నమెంట్ టెర్రరిజం నడుస్తోందని పారిశ్రామికవేత్త మోహన్ దాస్ పాయ్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని నక్కా ఆనంద్ బాబు విమర్శించారు.

minster
Gowtam reddy
Telugudesam
Nakka
AP
  • Loading...

More Telugu News