Chidambaram: సీబీఐ కోర్టులో చిదంబరం... మొదలైన వాదనలు

  • సీబీఐ కార్యాలయం నుంచి సీబీఐ కోర్టుకు చిదంబరం
  • కట్టుదిట్టమైన భద్రత మధ్య తరలింపు 
  • బెయిల్ పిటిషన్ వేయనున్న లాయర్లు

ఐఎన్ఎక్స్ మీడియా కేసు విచారణ నిమిత్తం కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు చేరుకున్నారు. కాసేపటి క్రితం ఆయనను సీబీఐ ప్రధాన కార్యాలయం నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య సీబీఐ కోర్టుకు తరలించారు. కాసేపటి క్రితమే ఆయనను కోర్టు హాల్లోకి ప్రవేశపెట్టారు. ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. చిదంబరం తరపున కాంగ్రెస్ నేతలు, సీనియర్ లాయర్లు అయిన కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్వి బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.

Chidambaram
CBI
Congress
  • Loading...

More Telugu News