Telugudesam: ఇప్పటికైనా సీఎం జగన్ వాస్తవాలు పరిశీలించాలి: టీడీపీ నేత సోమిరెడ్డి

  • ప్రభుత్వ విధానాలకు కోర్టు తీర్పు శరాఘాతం లాంటిది
  • ప్రతిపక్షంపై కక్ష సాధింపు ధోరణి మానుకోవాలి
  • ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడటం దారుణం

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రివర్స్ టెండర్లు నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పుపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ విధానాలకు ఈ తీర్పు శరాఘాతం లాంటిదని అన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ వాస్తవాలు పరిశీలించాలని సూచించారు. అభివృద్ధి విషయంలో ప్రతిపక్షంపై కక్ష సాధింపు ధోరణి మానుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడటం దారుణమని, సీఎం జగన్ ధోరణితో రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతున్నాయని విమర్శించారు.

Telugudesam
somireddy
cm
jagan
YSRCP
  • Loading...

More Telugu News