Andhra Pradesh: రాజధాని అమరావతిని ఎక్కడికీ తరలించడం లేదు: మంత్రి మేకపాటి

  • అమరావతిలోనే రాజధాని కొనసాగుతుంది
  • శివరామకృష్ణ కమిషన్ చెప్పిందే బొత్స చెప్పారు
  • రాజధానిని తరలిస్తున్నట్టు ఆయన చెప్పలేదు

అమరావతిని ఎక్కడికీ తరలించడం లేదని ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మండలంలో ఈరోజు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మేకపాటి మాట్లాడుతూ, అమరావతిలోనే రాజధాని కొనసాగుతుందని అన్నారు. శివరామకృష్ణ కమిషన్ చెప్పిందే మంత్రి బొత్స చెప్పారని, రాజధానిని తరలిస్తున్నట్టు ఆయన చెప్పలేదని అన్నారు. ఏపీలో తాగునీటి కోసం కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని, సోమశిల జలాశయం నుంచి జిల్లాలోని ప్రతి గ్రామానికి తాగునీరు అందిస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే సోమశిల జలాశయానికి నీటి కరవు ఉండదని అన్నారు. ఆత్మకూరు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎంజీఆర్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని చెప్పారు.

Andhra Pradesh
Nellore
Mekapati
Gowtham
  • Loading...

More Telugu News