Chidambaram: చిదంబరం బెయిల్ కోసం కాంగ్రెస్ ముమ్మర ప్రయత్నాలు!

  • ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం అరెస్ట్
  • చిదంబరాన్ని సీబీఐ కోర్టుకు తరలించిన అధికారులు
  • బెయిల్ కోసం రంగంలోకి దిగిన కపిల్ సిబాల్, అభిషేక్ సింఘ్వీ, సల్మాన్ ఖుర్షీద్

కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంను ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనను సీబీఐ ఈ ఉదయం విచారించింది. ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరంను 3 గంటల పాటు విచారించిన సీబీఐ అధికారులు కొన్ని ప్రశ్నలు అడగడం ద్వారా కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా తన కుమారుడి వ్యాపారాలతో తనకు సంబంధం లేదని చిదంబరం సీబీఐకి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఆపై ఆయనను సీబీఐ కోర్టుకు తరలించారు.

ఈ నేపథ్యంలో, కేంద్ర మాజీ మంత్రికి బెయిల్ కోసం కాంగ్రెస్ బృందం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు కపిల్ సిబాల్, అభిషేక్ సింఘ్వీ, సల్మాన్ ఖుర్షీద్ తమ సహచరుడ్ని బయటికి తీసుకువచ్చేందుకు బెయిల్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, చిదంబరంను 14 రోజుల కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానాన్ని సీబీఐ కోరే అవకాశాలున్నాయి. ఇంద్రాణీ ముఖర్జీ అప్రూవర్ గా మారడంతో చిదంబరంపై ఉచ్చు బిగిసింది.

  • Loading...

More Telugu News