Jagan: వరదలు వచ్చాయని రాజధానినే మార్చేస్తారా జగన్ గారూ?: జవహర్

  • ఢిల్లీ, మద్రాస్ లకు ఎన్నో సార్లు వరదలు వచ్చాయి
  • వాళ్లు రాజధానిని ఎందుకు మార్చలేదు?
  • మీకు మొదటి నుంచి అమరావతి అంటే ఇష్టం లేదు

ఏపీ రాజధానిని అమరావతి నుంచి దొనకొండకు మారుస్తారనే ప్రచారం జోరందుకుంది. రాజధానిపై త్వరలోనే ప్రకటన వెలువడుతుందని మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో, మాజీ మంత్రి, టీడీపీ నేత జవహర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు. వరదలు వచ్చాయని ఏకంగా రాజధానినే మార్చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ, మద్రాసులకు ఎన్నో సార్లు వరదలు వచ్చాయని... వాళ్లు రాజధానిని ఎందుకు మార్చలేదని అన్నారు. మీకు అమరావతి మొదటి నుంచి ఇష్టం లేదనే విషయం ప్రజలందరికీ తెలుసని ట్వీట్ చేశారు.

Jagan
Jawahar
Amaravathi
Donakonda
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News