chidambaram: చిదంబరం మేధావి...ఆయనకు ఇలా జరగడాన్ని నమ్మలేకపోతున్నా: బీజేపీ ఎంపీ సత్యపాల్‌సింగ్‌

  • చట్టం, న్యాయం గురించి తెలిసిన వ్యక్తికే ఇలా కావడం ఆశ్చర్యకరం
  • కోర్టు ఆదేశించిన వెంటనే ఆయన లొంగిపోవాల్సింది
  • దీనివల్ల ఆయన ప్రతిష్ట ఇనుమడించేది

మేధావి, చట్టం గురించి అన్నీ తెలిసిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ప్రస్తుత పరిస్థితిని తాను నమ్మలేకపోతున్నానని భారతీయ జనతా పార్టీ ఎంపీ సత్యపాల్‌ సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పట్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సత్యపాల్‌ సింగ్‌ చిదంబరం అరెస్టు అనంతరం ఈ రోజు మీడియాతో మాట్లాడారు.

దేశ రాజకీయాల్లో ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించిన వ్యక్తి చిదంబరం అని, ఆయన చాలా తెలివైన వారని అన్నారు. చట్టం, న్యాయంపై పూర్తి అవగాహన ఉన్న ఆయన కోర్టు ఆదేశాలు ఇచ్చిన వెంటనే లొంగిపోయి ఉంటే ఆయన ప్రతిష్ట ఎంతో ఇనుమడించేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఆయనకు ఎంతమాత్రం మంచిది కాదని తాను భావిస్తున్నానని అన్నారు.

chidambaram
MP styapalsing
INX case
arrest
  • Loading...

More Telugu News