Andhra Pradesh: చిదంబరం అరెస్టు చంద్రబాబు ఎఫెక్టే.. విజయసాయిరెడ్డి సెటైర్లు!

  • బాబుతో ఎవరు పెట్టుకున్నా అంతే
  • ఆయన పాద మహిమ అలాంటిది
  • చిదంబరం, శరద్ పవార్ లకు అందుకే కష్టాలు

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఎవరి ఇంట్లో పాదం మోపినా, కరచాలనం చేసినా ఆ వ్యక్తులు రాజకీయంగా పతనమైపోతారని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ఇదంతా యాధృచ్ఛికం ఏమీ కాదనీ, ఆయన పాద మహిమ అలాంటిదని ఎద్దేవా చేశారు.

చంద్రబాబుతో కలిసిన కారణంగానే ఇప్పుడు చిదంబరం గారికి పీకల్లోతు కష్టాలు వచ్చాయని విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోంమంత్రి చిదంబరాన్ని సీబీఐ నిన్న రాత్రి అరెస్ట్ చేసిన నేపథ్యంలో విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో ఈ మేరకు స్పందించారు.

Andhra Pradesh
Telugudesam
Chandrababu
YSRCP
Vijay Sai Reddy
Twitter
Chandrababu effect
  • Error fetching data: Network response was not ok

More Telugu News