Chidambaram: చిదంబరంను విచారించేందుకు 100 ప్రశ్నలను సిద్ధం చేసిన సీబీఐ
- చిదంబరంను నిన్న అరెస్ట్ చేసిన సీబీఐ
- ఈరోజు సీబీఐ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టనున్న అధికారులు
- తమ కస్టడీకి అప్పగించాలని కోరనున్న సీబీఐ
ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంను నిన్న సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని సీబీఐ హెడ్ క్వార్టర్లో నిన్న రాత్రంతా ఆయన గడిపారు. ఈరోజు ఆయనను సీబీఐ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా విచారణ నిమిత్తం చిదంబరంను తమ కస్టడీకి అనుమతించాలని సీబీఐ కోరనుంది. మరోవైపు, ఆయనను విచారించేందుకు సీబీఐ అధికారులు 100 ప్రశ్నలను సిద్ధం చేసినట్టు సమాచారం.
చిదంబరం అరెస్ట్ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతోందని కాంగ్రెస్ మండిపడింది. సీబీఐ, ఈడీలను స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. చిదంబరంకు అండగా ఉంటామని... చివరి వరకు పోరాడుతామని తెలిపింది.