Arjun reddy: ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు మాతృవియోగం!

  • ఈరోజు కన్నుమూసిన వంగ సుజాత
  • వరంగల్ లోని మరి వెంకటయ్యా కాలనీలో నివాసం
  • నేడు అంత్యక్రియలు

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇంట్లో విషాదం నెలకొంది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సందీప్ తల్లి వంగ సుజాత ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ప్రభాకర్ రెడ్డి, సుజాత దంపతులకు సందీప్ రెడ్డి, ప్రణయ్ రెడ్డి అనే పిల్లలు ఉన్నారు. వీరి స్వస్థలం వరంగల్ లోని మరీ వెంకటయ్య కాలని. కాగా, ఈరోజు తల్లి అంత్యక్రియలు జరిగే అవకాశముందని కుటుంబ సభ్యులు తెలిపారు.

Arjun reddy
movie
Tollywood
Director
Sandeep reddy vanga
mother
Passed away
  • Loading...

More Telugu News