Andhra Pradesh: విజయవాడలో రెచ్చిపోయిన ఆకతాయిలు.. వాహనాలకు నిప్పంటించి పరారీ!

  • కాలి బూడిదైన ఓ కారు, రెండు బైకులు
  • నిన్న అర్ధరాత్రి దాటాక సత్యనారాయణపురంలో ఘటన
  • పోలీసులను ఆశ్రయించిన బాధితులు

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఆకతాయిలు రెచ్చిపోయారు. రోడ్డుపై నిలిపి ఉంచిన బైక్ లపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. విజయవాడలోని సత్యనారాయణ పురంలో స్థానికులు రోజులాగే తమ వాహనాలను ఇంటి బయట పార్క్ చేశారు. అయితే అర్ధరాత్రి దాటాక ఇద్దరు ఆకతాయిలు ఓ బైక్ పై అక్కడకు చేరుకున్నారు.

బాటిల్ లో తీసుకొచ్చిన పెట్రోల్ ను ఓ కారు, రెండు ద్విచక్ర వాహనాలపై పోసి నిప్పంటించారు. అనంతరం ఘటనాస్థలి నుంచి పరారయ్యారు. ఈ ఘటన అంతా సీసీటీవీలో రికార్డయింది. ఈ ఘటనలో కారుతో పాటు రెండు బైకులు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాహన యజమానుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Andhra Pradesh
Vijayawada
Fire Accident
torched
Police
One car and two bikes
  • Loading...

More Telugu News