actor vishal: నటుడు విశాల్-అనీశా మధ్య మనస్పర్థలు.. ఆగిన వివాహం?

  • మార్చిలో విశాల్-అనీశా నిశ్చితార్థం
  • సోషల్ మీడియాలో ఫొటోలు డిలీట్ చేసిన అనీశా
  • పెళ్లి రద్దు చేసిన ఇరు కుటుంబాల పెద్దలు?

తమిళ నటుడు విశాల్-హైదరాబాద్ అమ్మాయి అనీశాల వివాహం ఆగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 10న వీరికి నిశ్చితార్థమైంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి టర్కీ ట్రిప్ వేసొచ్చారు. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు పొడసూపినట్టు తెలుస్తోంది. దీంతో వివాహం రద్దు చేసుకున్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫొటోలు పోస్టు చేస్తూ యాక్టివ్‌గా ఉండే అనీశా.. ఇటీవల విశాల్‌తో తానున్న ఫొటోలను డిలీట్ చేయడం ఈ అనుమానాలకు మరింత ఊతమిస్తోంది.

అయితే, వీరిమధ్య మనస్పర్థలకు కారణం ఏంటన్నది మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్న వార్తలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మనస్పర్థల నేపథ్యంలో ఇరు కుటుంబాల పెద్దలు కూడా పెళ్లి విషయంలో వెనకడుగు వేసినట్టు సమాచారం. అయితే, ఈ వార్తలపై అటు విశాల్ కానీ, ఇటు అనీశా కానీ ఇప్పటి వరకు స్పందించలేదు.

actor vishal
Actress anisha
marriage
kollywood
  • Loading...

More Telugu News