atti varadaraja swamy: కాంచీపురం వరదరాజ పెరుమాళ్‌కు భారీ ఆదాయం

  • గత నెల 1న మొదలై ఈ నెల 17న ముగిసిన ఉత్సవాలు
  • 18 హుండీల్లో 13 మాత్రమే లెక్కింపు
  • హుండీల్లో 164 గ్రాముల బంగారం, 4,959 గ్రాముల వెండి కానుకలు

అత్తివరదర్ ఉత్సవాల సందర్భంగా కాంచీపురం వరదరాజ పెరుమాళ్‌కు హుండీ ద్వారా రూ.9.90 కానుకలు వచ్చాయి. గత నెల ఒకటో తేదీన ప్రారంభమైన ఉత్సవాలు ఈ నెల 17తో ముగిశాయి. స్వామికి భక్తులు చెల్లించే కానుకల కోసం ఆలయ ప్రాంగణంలో మొత్తం 18 హుండీలను ఏర్పాటు చేశారు. తాజాగా వీటిని లెక్కించగా రూ.9.90 కోట్ల నగదు, 164 గ్రాముల బంగారం, 4,959 గ్రాముల వెండి కానుకలు వచ్చినట్టు కలెక్టర్ పొన్నయ్య తెలిపారు. ఇప్పటి వరకు 13 హుండీలను మాత్రమే లెక్కించామని, త్వరలోనే మిగతా హుండీలను కూడా లెక్కిస్తామని  కలెక్టర్ తెలిపారు.


 

atti varadaraja swamy
kanchipuram
Tamil Nadu
  • Loading...

More Telugu News