Congress: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం అరెస్టు

  • చిదంబరాన్ని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు
  • సీబీఐ వాహనంలో ఎక్కించి చిదంబరం తరలింపు 
  • అంతకుముందు చిదంబరం నివాసం వద్ద హైడ్రామా

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని కొద్ది సేపటి క్రితం సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. సీబీఐ వాహనంలో చిదంబరంను అధికారులు తరలించారు. సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు ఆయనను తరలించినట్టు సమాచారం. అంతకుముందు, ఢిల్లీలోని చిదంబరం నివాసంలోకి సీబీఐ, ఈడీ అధికారులను అనుమతించకపోవడంతో వారు గోడ ఎక్కి లోపలికి ప్రవేశించారు. ఆయన నివాసం వద్ద దాదాపు గంట సేపు హైడ్రామా అనంతరం చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.

Congress
chidambaram
Arrest
cbi
  • Loading...

More Telugu News