Jagan: వీరిద్దరూ బాహుబలి, సైరా నరసింహారెడ్డిలాంటి వారు: రోజా

  • జగన్ బాహుబలి, గౌతమ్ రెడ్డి సైరా నరసింహారెడ్డి
  • పెద్ద పారిశ్రామికవేత్తలైన వీరిద్దరూ.. మంచి పాలసీలు తీసుకొస్తారు
  • కొత్త ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొస్తాం

ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి జగన్ బాహుబలివంటి వారని, మంత్రి గౌతమ్ రెడ్డి సైరా నరసింహారెడ్డిలాంటి వారిని ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా అన్నారు. వీరిద్దరూ పెద్ద పారిశ్రామికవేత్తలని... వీరిద్దరూ కలసి ఏపీకి మంచి పారిశ్రామిక పాలసీలు తీసుకొస్తారని చెప్పారు. నెల్లూరు జిల్లాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన పారిశ్రామికవేత్తల సదస్సులో మాట్లాడుతూ, ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

నిర్దేశించిన సమయంలోనే పారిశ్రామికవేత్తలకు అనుమతులు ఇస్తామని... పైసా లంచం తీసుకోకుండానే అనుమతులు ఇవ్వాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని రోజా తెలిపారు. కొత్త ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొస్తామని వెల్లడించారు. స్థానికులకు ఉద్యోగాల విషయమై అన్ని చోట్లా ఫిర్యాదులు వస్తున్నాయని... దీనిపై పారిశ్రామికవేత్తలు ఆలోచించాలని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా గడవక ముందే పరిశ్రమలు తరలిపోతున్నాయని ఆరోపణలు చేయడం దారుణమని అన్నారు.

Jagan
Gowtham Reddy
Roja
YSRCP
  • Loading...

More Telugu News