Andhra Pradesh: కృష్ణా జిల్లాలో వరద బీభత్సం.. బాధితులను పరామర్శించిన మంత్రులు, ఎమ్మెల్యేలు!

  • పెనమలూరు, అవనిగడ్డలో పర్యటన
  • అన్నిరకాలుగా ఆదుకుంటామని హామీ
  • సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశం

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు, వరదల కారణంగా కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు పార్థసారథి, కైలే అనిల్ కుమార్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.

పెనమలూరు, అవనిగడ్డ, పామర్రులో వర్షాలు, వరదలకు దెబ్బతిన్న పంటలు, ఇళ్లను పరిశీలించారు. ప్రభుత్వం అందర్నీ ఆదుకుంటుందనీ, భయపడవద్దని ధైర్యం చెప్పారు. బాధితులకు నిత్యావసరాలతో పాటు మందులు, అవసమైన సామగ్రిని అందించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

Andhra Pradesh
Krishna District
FLOODS
MINISTERS
MLAs
TOUR
CONSOLE
  • Loading...

More Telugu News