Chidambaram: ఎన్నో ఏళ్లు దేశానికి సేవ చేసిన వ్యక్తి పట్ల సీబీఐ వ్యవహరించే తీరు ఇదేనా?: ప్రియాంక గాంధీ

  • చిదంబరం పట్ల సీబీఐ అవమానకరంగా వ్యవహరిస్తోంది
  • ఆయనకు మేమంతా అండగా ఉంటాం
  • నిజాలు మాట్లాడే వారిపై నిందలు వేస్తున్నారు

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంతో సీబీఐ వ్యవహరిస్తున్న తీరును ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తప్పుబట్టారు. ఎన్నో ఏళ్ల పాటు దేశానికి సేవ చేసిన వ్యక్తి పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? అని ప్రశ్నించారు. దశాబ్దాలుగా దేశానికి చిదంబరం సేవ చేశారని... కేంద్ర ఆర్థిక, హోం మంత్రిగా బాధ్యతలను నిర్వహించారని చెప్పారు. నిజాలను నిర్మొహమాటంగా మాట్లాడటం ఆయన నైజమని... కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ఎండగడుతున్నారని అన్నారు. కొందరు పిరికిపందల వల్ల నిజాలు మాట్లాడే వారిపై నిందలు పడుతున్నాయని వ్యాఖ్యానించారు.

చిదంబరం పట్ల సీబీఐ అవమానకరంగా ప్రవర్తిస్తోందని ప్రియాంక విమర్శించారు. ఆయనకు తామంతా మద్దతుగా నిలుస్తామని... ఎన్ని అడ్డంకులు ఎదురైనా బెదరబోమని... న్యాయం కోసం పోరాడుతామని చెప్పారు.

Chidambaram
Priyanka Gandhi
Congres
CBI
  • Loading...

More Telugu News