Sameera Reddy: హృతిక్ నా జీవితాన్ని మార్చేశాడు: సమీరా రెడ్డి

  • మాట్లాడే సమయంలో ఇబ్బందికి గురయ్యేదాన్ని
  • ఎవరి ముందైనా మాట్లాడేందుకు భయపడేదాన్ని
  • హృతిక్ ఇచ్చిన పుస్తకం నా జీవితాన్ని మార్చేసింది

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ పై సినీ నటి సమీరా రెడ్డి ప్రశంసలు కురిపించింది. మాట్లాడే సమయంలో తాను తడబాటుకు గురయ్యేదాన్నని... ఎవరి ముందైనా మాట్లాడేందుకు భయపడేదాన్నని... ఆడిషన్స్ సమయంలో చాలా ఇబ్బందికి గురయ్యేదాన్నని తెలిపింది. ఆ సమస్యను హృతిక్ గుర్తించాడని... ఇబ్బంది నుంచి బయటపడేందుకు సాయపడ్డాడని చెప్పింది. ఓ చాట్ షోలో సమీరా మాట్లాడుతూ, హృతిక్ కూడా తన జీవితంలో ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నాడని వెల్లడించింది.

తన సమస్యను గుర్తించిన హృతిక్... తనకు ఓ పుస్తకాన్ని ఇచ్చాడని, ఆ పుస్తకం తన జీవితాన్నే మార్చివేసిందని సమీరా తెలిపింది. ఆ తర్వాత తన మాటల్లో వచ్చిన మార్పును తాను గమనించానని... అనంతరం స్పీచ్ థెరపిస్టును కూడా కలిశానని చెప్పింది. ఇప్పటికీ ఆ పుస్తకం తన వద్దే ఉందని... ఆ పుస్తకం ఇచ్చిన హృతిక్ కు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదని తెలిపింది. ఇటీవలే ఓ పండంటి ఆడ బిడ్డకు సమీరా జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

Sameera Reddy
Hrithik Roshan
Bollywood
Tollywood
  • Loading...

More Telugu News