Indian army: ఆరుగురు భారత జవాన్లను చంపేశామన్న పాక్.. దీటుగా స్పందించిన భారత్

  • అబద్ధాలను ప్రచారం చేస్తున్న పాక్
  • ఒక్కరు మాత్రమే మృతి
  • పాకిస్థాన్‌లా మృతుల సంఖ్యను దాచుకోబోమన్న ఇండియన్ ఆర్మీ

నియంత్రణ రేఖ వెంబడి ఆరుగురు భారత జవాన్లను హతమార్చామన్న పాక్ ఆర్మీ ప్రకటనపై భారత్ స్పందించింది. పాక్ కాల్పుల్లో ఒకరు మాత్రమే మరణించారని స్పష్టం చేసింది. నలుగురు మాత్రం గాయాలతో తప్పించుకున్నారని తెలిపింది. ఆరుగురు భారత జవాన్లను హతమార్చామన్న పాక్ ప్రకటనలో వాస్తవం లేదని తేల్చి చెప్పింది. ప్రచార ఆర్భాటం కోసం పాక్ ఆడుతున్న నాటకం మాత్రమేనని పేర్కొంది. తాము పాక్ ఆర్మీలా మృతుల సంఖ్యను దాచుకోబోమని, ఉన్నది ఉన్నట్టు చెబుతామని ఇండియన్ ఆర్మీ దీటుగా బదులిచ్చింది.

Indian army
Pakistan
Loc
  • Loading...

More Telugu News