Azad: ఆజాద్ ను మరోసారి ఎయిర్ పోర్టులో అడ్డుకున్న పోలీసులు

  • ఆర్టికల్ 370 రద్దుతో ఆజాద్ అసంతృప్తి
  • కశ్మీర్ వెళ్లేందుకు విఫలయత్నాలు
  • ఇటీవలే ఆజాద్ ను శ్రీనగర్ నుంచి ఢిల్లీ తిప్పిపంపిన పోలీసులు

జమ్మూకశ్మీర్ లో అడుగుపెట్టేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ను పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత స్వరాష్ట్రంలో పర్యటించేందుకు ఆజాద్ ఢిల్లీ నుంచి శ్రీనగర్ రాగా ఆయనను ఎయిర్ పోర్టులోనే అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ మధ్యాహ్నం మళ్లీ శ్రీనగర్ వచ్చిన ఆయనను పోలీసులు ఎయిర్ పోర్టు నుంచే తిప్పి పంపారు.

రాష్ట్రంలో ఆంక్షలు ఉన్నాయని పోలీసులు అభ్యంతరం చెప్పారు. తన నివాసానికి వెళ్లేందుకైనా అనుమతించాలని ఆజాద్ కోరినా పోలీసులు అంగీకరించలేదు. పోలీసులతో వాదనకు దిగిన ఈ కాంగ్రెస్ సీనియర్ నేత పార్టీ కార్యాలయం వరకు వెళ్లి వస్తానని చెప్పినా ప్రయోజనం కనిపించలేదు. పోలీసులు ససేమిరా అనడంతో ఆజాద్ కు నిరాశ తప్పలేదు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మరి ఎవరిని రాష్ట్రంలోకి రానిస్తారని ఆగ్రహంతో ప్రశ్నించారు.

Azad
Congress
Srinagar
Jammu And Kashmir
  • Loading...

More Telugu News