Red sandal: ఎర్ర చందనం స్మగ్లర్ గంగిరెడ్డి బెయిల్ పై విడుదల

  • గంగిరెడ్డిపై  మొత్తం 26 కేసులు
  • బెయిల్ లభించడంతో కడప జైలు నుంచి విడుదల
  • నాటి అలిపిరి ఘటన కేసులోనూ గంగిరెడ్డి నిందితుడు

కడప సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్న ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి బెయిల్ పై విడుదలయ్యాడు. గంగిరెడ్డిపై మూడు జిల్లాల్లో మొత్తం 26 కేసులు ఉన్నాయి. ఈ కేసులకు సంబంధించి ఆయనకు బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. కాగా, 2012లో ఎర్రచందనం కేసులో గంగిరెడ్డి విదేశాలకు పారిపోయాడు. వివిధ దేశాల్లో తలదాచుకున్నాడు. 2015లో దొంగ పాస్ పోర్టుతో మారిషస్ చేరుకున్నాడు. అక్కడి నుంచి దుబాయ్ వెళ్లేందుకు యత్నిస్తుండగా అక్కడి పోలీసులు గంగిరెడ్డిని అరెస్టు చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో గంగిరెడ్డిని భారత్ కు తీసుకొచ్చారు. ఎర్రచందనం స్మగ్లింగ్ తో పాటు నాడు అలిపిరి ఘటన కేసులో గంగిరెడ్డి నిందితుడు.

Red sandal
smuggler
Gangireddy
Bail
  • Loading...

More Telugu News