Abhinandan: అభినందన్ ను పట్టుకున్న అహ్మద్ ఖాన్ హతం... ఎదురుకాల్పుల్లో మట్టుబెట్టిన ఇండియన్ ఆర్మీ

  • విమానం కూలిపోయిన ఘటనలో అభినందన్ ను బంధించిన అహ్మద్ ఖాన్
  • పాక్ ఆర్మీలో స్పెషల్ కమాండోగా పనిచేస్తున్న అహ్మద్ ఖాన్
  • ఉగ్రవాదులను భారత్ లో ప్రవేశపెట్టడంలో స్పెషలిస్ట్ గా గుర్తింపు!

కొన్నినెలల క్రితం భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే అభినందన్ విమానం పీఓకేలో కూలిన సమయంలో అహ్మద్ ఖాన్ అనే కమాండో పాకిస్థాన్ లో హీరో అయ్యాడు. పాకిస్థాన్ సైన్యంలో స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ కమాండోగా విధులు నిర్వర్తిస్తున్న అహ్మద్ ఖాన్ తమ భూభాగంలో అడుగిడిన అభినందన్ ను పట్టుకున్నాడు. దాంతో పాకిస్థాన్ లో అహ్మద్ ఖాన్ కు నీరాజనాలు పలికారు. ఇప్పుడా అహ్మద్ ఖాన్ ను భారత సైన్యం అంతమొందించింది.

ఉగ్రవాదులను భారత్ లోకి పంపించేందుకు ప్రయత్నించే క్రమంలో అహ్మద్ ఖాన్ హతుడయ్యాడు. చొరబాట్లు జరుగుతున్న విషయాన్ని గుర్తించిన భారత బలగాలు వెంటనే అప్రమత్తమై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లోనే అహ్మద్ ఖాన్ మృతి చెందాడు. పాక్ లో శిక్షణ పొందిన ఉగ్రవాదులను భారత్ లోకి పంపించడంలో అహ్మద్ ఖాన్ ఇప్పటివరకు కీలకపాత్ర పోషించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News