KTR: కేటీఆర్... నడ్డా నీలాగా కార్పొరేట్ సంస్థల పెంపుడు నేత కాదు: దత్తాత్రేయ ఘాటు వ్యాఖ్యలు

  • నడ్డా కాదు అబద్ధాల అడ్డా అంటూ కేటీఆర్ విమర్శలు
  • మండిపడిన దత్తన్న
  • కేటీఆర్ కు లేఖ

బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఎవరో తెలియదంటూ వ్యాఖ్యానించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ మండిపడ్డారు. నడ్డా ఎవరో తెలియదనడం కేటీఆర్ రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం అని పేర్కొన్నారు. ఈమేరకు కేటీఆర్ కు ఓ లేఖాస్త్రం సంధించారు. కేటీఆర్ లా నడ్డా కార్పొరేట్ సంస్థల పెంపుడు నేత కాదని ఘాటుగా విమర్శించారు. 2016లో తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటు కోసం నడ్డాను కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని కేటీఆర్ మర్చిపోయినట్టున్నారని పేర్కొన్నారు.

ఆరోగ్యశ్రీ నిలిపివేతతో పేదలు రోడ్డున పడ్డారని దత్తాత్రేయ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం అబద్ధాల పుట్టని తన లేఖలో ఆరోపించారు. ఓ కార్యక్రమంలో నడ్డాపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేయడం తెలిసిందే. నడ్డా కాదు, అబద్ధాల అడ్డా అంటూ కేటీఆర్ ప్రాసతో కూడిన విమర్శలు చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News