Andhra Pradesh: ఏపీ నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని తప్పుడు ప్రచారం.. తీవ్రంగా స్పందించిన జగన్ సర్కారు!

  • సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
  • వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం
  • ప్రకటన విడుదల చేసిన ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీ

ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని కొందరు వ్యక్తులు పనిగట్టుకుని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారని ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారం నిర్వహించే వ్యక్తులపై తాము చట్టపరంగా ముందుకెళతామనీ, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కొందరు వ్యక్తులు ఏషియన్ పల్ప్ అండ్ పేపర్(ఏపీపీ) అనే సంస్థ రాష్ట్రం నుంచి పెట్టుబడులను తరలిస్తున్నట్లు సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో అవినీతిరహిత విధానాలను పాటిస్తూ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రిన్సిపల్ సెక్రటరీ తెలిపారు. ప్రస్తుతం తమ అధికారులు ఏపీపీ సంస్థతో మాట్లాడారనీ, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పూర్తి సహకారాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

Andhra Pradesh
indutries leaving
fake news
Jagan
Chief Minister
warning
leagal action
serious action
  • Loading...

More Telugu News