Telangana: ఇంజనీరింగ్ యువతికి ల్యాబ్ టెక్నీషియన్ వేధింపులు.. చితక్కొట్టిన విద్యార్థులు!

  • తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఘటన
  • పరీక్ష రాసేందుకు వచ్చిన యువతికి టార్చర్
  • నిందితుడిని పోలీసులకు అప్పగించిన విద్యార్థులు

ఇటీవలి కాలంలో కామాంధులు రెచ్చిపోతున్నారు. స్కూళ్లు, కాలేజీలతో పాటు బస్టాండ్లలో కూడా అమ్మాయిలను వేధింపులకు గురిచేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. తాజాగా తెలంగాణలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిని ఓ కామాంధుడు కాలేజీ ఆవరణలోనే వేధించగా, అక్కడే ఉన్న విద్యార్థులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో పరీక్ష రాసేందుకు ఓ అమ్మాయి వచ్చింది. అయితే అక్కడే ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న వెంకటేశ్, యువతిని వేధించడం ప్రారంభించాడు. దీంతో తిరగబడ్డ అమ్మాయి అతని కాలర్ పట్టుకుంది. బరబరా బయటకు ఈడ్చుకొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఇతర విద్యార్థులు వెంకటేశ్ ను చితక్కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కాగా, తన ప్రవర్తన పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేసిన వెంకటేశ్, క్షమించాలని కోరుతూ యువతికి లేఖ రాసి ఇచ్చాడు.

Telangana
Lab technician
Harassment
Engineering girl
students
Beaten
Police
  • Loading...

More Telugu News