Andhra Pradesh: కృష్ణా వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు!

  • హైదరాబాద్ నుంచి గన్నవరానికి రాక
  • విజయవాడలో వరద బాధితులతో సమావేశం
  • చంద్రబాబుకు తమ కష్టాలు చెప్పుకున్న నగర వాసులు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా నది వరదముంపు ప్రాంతాల్లో పర్యటించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని గీతానగర్, భూపేశ్ గుప్తా నగర్, తారకరామా నగర్ తదితర ప్రాంతాల్లో ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వరద బాధితులు తమ సమస్యలను చంద్రబాబుతో చెప్పుకున్నారు. వరదల కారణంగా పిల్లలతో పాటు తామంతా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని టీడీపీ అధినేత దృష్టికి తీసుకొచ్చారు.

కాగా, ఈ పర్యటన ముగిశాక చంద్రబాబు మీడియాతో మాట్లాడే అవకాశముందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అంతకుముందు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న చంద్రబాబుకు తెలుగుదేశం నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా చంద్రబాబు విజయవాడకు చేరుకున్నారు.

Andhra Pradesh
Vijayawada
Floods
Chandrababu
Telugudesam
tour
  • Loading...

More Telugu News