Andhra Pradesh: ప్రపంచంలోని టెర్రరిస్టులకు చిట్టినాయుడు విధ్వంసకరమైన ఐడియా ఇచ్చాడు!: విజయసాయిరెడ్డి సెటైర్లు

  • ఇప్పుడు ఉగ్రవాదులంతా తుపాకులు వదిలేశారు
  • నాటు పడవలతో వరద ముప్పు సృష్టించాలని చూస్తున్నారు
  • ఎంతైనా స్టాన్ ఫర్డ్ లో చదువుకున్నోడు కదా

టీడీపీ అధినేత చంద్రబాబు ఇంట్లోకి వరదనీరు తెప్పించడానికి వైసీపీ నేతలు ప్రకాశం బ్యారేజీ గేట్లకు అడ్డంగా పడవలను ముంచారని నారా లోకేశ్ ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా లోకేశ్ వ్యాఖ్యలపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మరోసారి వెటకారంగా స్పందించారు. ప్రపంచంలో ఉండే ఉగ్రవాద సంస్థలన్నింటికి చిట్టినాయుడు(లోకేశ్) విధ్వంసకరమైన ఐడియా ఇచ్చాడని విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు.

ఇప్పుడు టెర్రరిస్టులు అంతా తుపాకులు, బాంబులు పక్కనపడేసి నాటు పడవలను ఆయుధాలుగా వాడాలని నిర్ణయించారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వాళ్లంతా డ్యాం గేట్లకు నాటు పడవలను అడ్డుపెట్టి వరద ముప్పును సృష్టించాలని ప్లాన్ వేస్తున్నారని వెటకారం చేశారు. ఎంతైనా లోకేశ్ స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదవిన వ్యక్తి కదా! అని సెటైర్ వేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.

Andhra Pradesh
YSRCP
Vijay Sai Reddy
Twitter
flood
Prakasam barrage
Telugudesam
Nara Lokesh
  • Loading...

More Telugu News