Telangana: భద్రాద్రి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. రూ.100 కోట్లు కేటాయింపు!: నామా నాగేశ్వరరావు

  • టీఆర్ఎస్ ఎంపీ నామా ప్రకటన
  • యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని వెల్లడి
  • రాములవారిని దర్శించుకున్న టీఆర్ఎస్ నేత

టీఆర్ఎస్ నేత, పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. భద్రాద్రి రామాలయం అభివృద్ధిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు. ఇందులో భాగంగా యాదాద్రి తరహాలో రామాలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.

ఇందుకోసం రూ.100 కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా భద్రాద్రికి రైల్వే లైన్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఖమ్మం జిల్లా నుంచి ఏపీలో కలసిన 5 పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేసే విషయమై కేంద్రంతో మాట్లాడుతామని ఆయన హామీ ఇచ్చారు.

Telangana
bhadradri
ramalayam
TRS
mp
nama
venkeswarlu
RS.100 crores
Master plan
  • Loading...

More Telugu News